ఏడాదికి ఉచితంగా 5 గ్యాస్‌ సిలిండర్లు.. ఎన్నికల ముందు సంచలన నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

ఏడాదికి ఉచితంగా 5 గ్యాస్‌ సిలిండర్లు.. ఎన్నికల ముందు సంచలన నిర్ణయం

Apr 16 2023 8:00 AM | Updated on Apr 16 2023 8:44 AM

- - Sakshi

బనశంకరి: శాసనసభ ఎన్నికలకు జేడీయస్‌ పార్టీ మేనిఫెస్టోని విడుదలచేసింది. శనివారం పద్మనాభనగరలోని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ నివాసంలో విడుదల చేశారు. ముఖ్యంగా 12 హామీలు ఉన్నాయి.

మహిళల బలోపేతం, కన్నడకు ప్రాధాన్యం, రైతు చైతన్యం, వృద్ధులకు సన్మానం, విద్య ఆధునిక శక్తి, ఆరోగ్య సంపద, దివ్యాంగులకు ఆసరా, మతపర మైనారిటీల ప్రగతి, ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రోత్సాహకాలు, సీ్త్ర స్వయం సేవా సంఘాలకు రుణాలు మాఫీ, పేద కుటుంబాలకు ఏడాదికి 5 వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, గర్భిణీలకు 6 నెలలపాటు రూ.6 వేలు భత్యం, వితంతు పింఛన్‌ రూ.900 నుంచి రూ.2500 లకు పెంపు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు రూ.5 వేలు వేతనం, అలాగే కనీసం 15 ఏళ్లు సర్వీసుతో రిటైరైన వారికి పెన్షన్‌ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. రైతులకు ప్రతి ఎకరా కు రూ.10 వేలు సహాయ ధనం, వ్యవసాయ కార్మిక కుటుంబానికి రూ.2 వేలు సహాయ ధనం, రైతు యువకులను పెళ్లాడే యువతులకు రూ.2 లక్షలు ప్రోత్సాహక ధనం, వృద్ధులకు నెలవారి పింఛన్‌ రూ.1500 నుంచి రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ డీ కుమారస్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement