ఈ ఫొటోలో కనిపిస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన ఆకుల చిన్న నారాయణ పొలం. ఏడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంట పొట్టకొచ్చే దశలో తరచూ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, ఫ్యూజ్ చెడిపోవడం, వైర్లు తెగడం లాంటి సమస్యలతో సరిపడా నీరందడం లేదు. దీంతో జనరేటర్ కిరాయి తెచ్చి ఐదు రోజులుగా పంటకు సాగునీరు అందిస్తున్నాడు. జనరేటర్కు రోజుకు రూ.2వేల కిరాయి ఇస్తుండగా, గంటకు మూడు లీటర్ల డీజిల్ అవుతోందని, ఇలా రోజుకు రూ.5000 వరకు వెచ్చిస్తున్నట్లు తెలిపాడు.


