కరీంనగర్‌టౌన్: వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాగా, పాఠశాలల్లో తొలిరోజు హాజరుశాతం అతి తక్కువ నమోదు కావ డం గమనార్హం. సోమవారం అమావాస్య కావడంతో పిల్ల్ల లను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లను శుభ్రం చేసి విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మొదటి రోజు స్కూళ్లకు హాజరుకావడంతో ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులకు చాకెట్లు పంచుతూ, పూలు అందజేస్తూ పాఠశాలల్లోకి ఆహ్వానించారు. పలుచోట్ల ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు.


