వివాదాల్లో ఖాకీ! | - | Sakshi
Sakshi News home page

వివాదాల్లో ఖాకీ!

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ నీలం రామ్మోహన్‌ సొంతశాఖ ఉద్యోగులకు అందాల్సిన జీతాలను కాజేశాడు. ఈ ప్రక్రియకు కరీంనగర్‌ కమిషనరేట్‌ ఏవోస్థాయి అధికారి సహకరించడంతో రూ.కోట్లలో దండుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు పంపారు.

వరుస ఘటనలతో కలకలం లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఓ ఎస్సై ఇసుక దందాలో కానిస్టేబుళ్ల జోక్యం పలు ఠాణాల్లో స్టేషన్‌ బెయిల్‌ దందాలు సివిల్‌ వివాదాల్లో తలదూర్చుతున్న పలువురు పోలీసులు

జమ్మికుంట పోలీసుస్టేషన్‌ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కదిరె శ్రీకాంత్‌ ఓ మహిళను వేధించిన కేసులో చిక్కుకున్నాడు. శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వివాహిత ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆరోపణలొచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 15న వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్‌లో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది.

వీణవంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి మామూళ్లు వసూలు చేయడంతో పాటు సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన ఆరోపణలతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

ఆగండి అన్నా అన్నందుకు.. నాయీ బ్రాహ్మణుడిపై ఎస్సై దాడి సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు

కరీంనగర్‌ క్రైం:

ట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీసులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులకు అక్కడి సిబ్బంది చేయి తడపనిదే పని జరగక పోగా.. ఇదేంది సారూ అని అడిగితే జులుం ప్రదర్శించడం పలువురు సిబ్బంది వంతవుతోంది. ఇటీవల కాలంలో కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ వరుస వివాదాలకు నెలవుగా మారుతుండగా, ఎస్సై నుంచి కానిస్టేబుల్‌ వరకు కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఈ ఒక్క నెలలో మూడు ఘటనలు జరగడం కలంకంగా మారాయి.

రాజకీయ పలుకుబడితో..

పలువురు సిబ్బంది రాజకీయ పలుకుబడితో వారికి నచ్చిన పోలీసు స్టేషన్‌లో పోస్టింగ్‌లు తెచ్చుకొని, ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పోలీసుశాఖలో అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందా? లేక క్రమశిక్షణ లోపించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలువురు సిబ్బంది సివిల్‌ వివాదాల్లో తలదూర్చుతూ, ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇసుక వనరులు ఉన్నచోట్ల వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారని చెబుకుంటున్నారు. పోలీసుశాఖలో ఎక్కడ ఏంజరిగినా క్షణాల్లో తెలుసుకునే ఎస్‌బీ విభాగం ఏంపనిచేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు రక్షణగా నిలవాల్సినవారు అడ్డదారిలో వెళ్తే, అలాంటివారిపై వ్యవస్థలో పారదర్శకతను పెంచేలా చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలు పోలీసుశాఖలో పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

నన్నే అన్నా అంటావా?

కరీంనగర్‌క్రైం: హెయిర్‌ సెలూన్‌కు కటింగ్‌కోసం వెళ్లిన ఓ ఎస్సై అందులో పనిచేసే వ్యక్తిపై తన జులుం ప్రదర్శించాడు. ‘షాపు ఇప్పుడే తెరిచాను కొద్దిసేపు ఆగండి అన్నా’ అన్న పాపానికి పిడిగుద్దులు గుద్ది, దుర్భాషలాడాడు. ఈ ఘటన కరీంనగర్‌లోని ఖాన్‌పుర ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని త్రీటౌన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించే చైతన్య చందర్‌ ఉదయం ఖాన్‌పుర ప్రాంతంలో ఉండే ఓ సెలూన్‌కు వెళ్లాడు. తనకు కటింగ్‌ చేయాలని నాయీబ్రాహ్మణుడు పడాల రాములును కోరా డు. ‘ఇప్పుడే షాపు తెరిచాను. కొద్దిసేపు ఆగండి అన్నా’ అని రాములు సమాధానం చెప్పటంతో ‘నన్ను అన్నా అంటావా? కాసేపు ఆగమంటావా’? అంటూ దూషిస్తూ చేయిచేసుకున్నా డు. సెలూన్‌లో ఉన్న సీసీకెమెరాల్లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అప్రమత్తమైన త్రీ టౌన్‌ సీఐ తిరుమల్‌ వెంటనే టౌన్‌ ఏసీపీ వెంకటస్వామికి సమాచారమిచ్చారు. విచారణ అనంతరం సీపీకి నివేదిక అందించారు. ఈ ఘటనలో ఎస్సై చైతన్య చందర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రాములుపై దాడి చేసిన త్రీటౌన్‌ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణుల జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement