ఆర్టీసీలో సంబురాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సంబురాలు

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

కరీంనగర్‌టౌన్‌: ఆర్టీసీ కార్మికులు కరీంనగర్‌ బస్టాండ్‌ ఆవరణలో సంబురాలు నిర్వహించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, 11శాతం పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లు నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్‌గౌడ్‌కు నివాళి అర్పించారు. ఆర్టీసీ ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి టీఆర్‌రెడ్డి, ముస్తాక్‌ అహ్మద్‌, కుంబాల రాజు కుమార్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల నిరాహార దీక్ష

కరీంనగర్‌/కరీంనగర్‌ టౌన్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న రూ.10వేల కోట్లకు పైగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆ శ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడం వల్లే విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు వచ్చినట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు అన్నారు.గోస్కు ల అజయ్‌, బామండ్ల నందు, యోగేశ్‌, మురళి, శ్రీపతి వంశీ, నాగరాజు, విఘ్నేశ్‌, అనూష పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement