ధాన్యం త్వరగా దిగుమతి చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం త్వరగా దిగుమతి చేసుకోవాలి

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

కరీంనగర్‌ అర్బన్‌: కేంద్రాల నుంచి వచ్చే ధా న్యాన్ని త్వరితగతిన దింపుకోవాలని, జా ప్యం చేస్తే కఠినచర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శని వారం కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లు, అధికారులతో సమీక్షించారు. ప్రతీ రోజు ధాన్యం కొనుగోళ్ల ఏజెన్సీల అధికారులతో సమీక్షిస్తున్నామని, సకాలంలో బ్యాంకు గ్యారంటీలు సమర్పించా లని మిల్లర్లను ఆదేశించామని తెలిపారు. ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, రైస్‌ మిల్లర్ల నిర్లక్ష్యం వంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, ఫిర్యా దు చేసేవారు 9154249727 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. యాసంగి సీజన్‌కు గానూ 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 105మంది రైతుల నుంచి 739 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. దొడ్డు రకాలు 703 మెట్రిక్‌ టన్నులు, సన్నరకాలు 36 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ యం.రజనీకాంత్‌, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, వీరకుమార్‌ పాల్గొన్నారు.

నిందితులకు శిక్ష పడేలా కృషిచేయాలి

కరీంనగర్‌క్రైం: నేరాలు చేసినవారికి శిక్ష పడేలా చేయడంతో పాటు, బాధితులకు న్యాయం చేయడమే ప్రాసిక్యూటర్ల బాధ్యత అని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎస్‌.సాంబశివరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99రోజుల కార్యక్రమం చేపట్టగా, శని వారం కరీంనగర్‌ ప్రాసిక్యూషన్‌ యూనిట్‌ను సందర్శించారు. ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ అఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదుల సమన్వయంతో ముందుకెళ్లాలని ప్రాసిక్యూటర్లకు సూచించారు. ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ధరావత్‌ శరత్‌, ఏడీపీవో లక్ష్మిప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

నగరంలో పవర్‌కట్‌

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్లు, డీటీఆర్‌ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.వెంకటసాయి ఫీడర్‌ పరిధిలోని పద్మశాలి వీధి, లక్ష్మీనగర్‌, రాఘవేంద్రనగర్‌, పాతబజార్‌, ఉదయం 6 నుంచి 11 గంటల వరకు జిల్లా గ్రంథాలయం,టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌, వాణినికేతన్‌ డిగ్రీ కళాశాల, జాఫ్రీ మసీద్‌, ముకరంపుర, సర్కస్‌ మైదానం, ఐబీ చౌరస్తా, తెలంగాణ చౌక్‌, కార్పెంటర్స్‌ సొసైటీ, సంతోషిమాత ఆలయం ప్రాంతాలతో పాటు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్‌ పరిధిలోని కట్టరాంపూర్‌ మెయిన్‌ రోడ్‌, తిరుమలనగర్‌, రెడ్డికాలనీ, మైనార్టీ స్కూల్‌, గిద్దె పెరుమాండ్ల ఆలయం, హనుమాన్‌నగర్‌, జయశంకర్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, గణేశ్‌నగర్‌ బైపాస్‌, కమాన్‌, ఎన్‌టీఆర్‌ విగ్రహం, అల్కాపురి, ఐటీఐ, పాలిటెక్నికల్‌ కళాశాలలు, ఐటీ హబ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌ గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు.

ఢిల్లీ సదస్సులో కమిషనర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఢిల్లీలో కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు కు బల్దియా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బ న్‌ చాలెంజ్‌ఫండ్‌ స్కీంతో పాటు, దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల పురోగతి, ప్రాజెక్టుల రూపకల్పనపై సదస్సులో చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement