సమీకృత కలెక్టరేట్‌ను సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

సమీకృత కలెక్టరేట్‌ను సిద్ధం చేయండి

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

కరీంనగర్‌ అర్బన్‌/కరీంనగర్‌ టౌన్‌: సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించా రు. శనివారం ఐడీఓసీ బ్యాలెన్స్‌ పనులపై అధికారులతో సమీక్షించారు. జూన్‌ రెండులోగా కాంప్లెక్స్‌ను అన్ని రకాలుగా ప్రారంభానికి సిద్ధం చేసి ఉంచాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీవో కే మహేశ్వర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కే.రాం, ఈఈ నరసింహచారి, తదితరులు పాల్గొన్నారు.

బాలల భద్రతలో అగ్రభాగాన నిలవాలి

బాలల భద్రత, సంక్షేమంపై కొనసాగనున్న కార్యక్రమంలో జిల్లాను అగ్రభాగాన ఉంచేందుకు అధికా రులు కృషి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ, సఖి, స్వధార్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈనెల 27 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బాలల భద్రత రక్షణ సంక్షేమం కార్యక్రమాలను ప్రణాళిక ప్ర కారం నిర్వహించాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, సంక్షేమాధికారి సరస్వతి పాల్గొన్నారు.

పలువురు సీఐల బదిలీ

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ ఎస్‌బీ విభాగంలో పనిచేస్తున్న వీరబత్తిని శ్రీనివాస్‌ హుజురాబాద్‌ రూరల్‌కు, అక్కడ పనిచేస్తున్న పులి వెంకటిని జమ్మికుంట రూరల్‌కు బదిలీ చేశారు. వరంగల్‌ కమిషనరేట్‌ నుంచి బొల్లం రమేశ్‌ను తిమ్మాపూర్‌ సర్కిల్‌కు, అక్కడి నుంచి గడ్డం సదన్‌కుమార్‌ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement