కొద్దిరోజులుగా మండుతున్న ఎండలకు తట్టుకోలేక జిల్లాలోని ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మిషన్లు వేడెక్కి ఎక్కడ నిప్పంటుకుంటాయో అన్న భయంతో నగరంలోని జ్యోతినగర్‌లో ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు వినూత్న రీతిలో ఆలోచన చేశారు. అటు మిషన్లు, ఇటు కష్టమర్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బంక్ చుట్టూ వాటర్ స్ప్రింక్లర్లు మంచుకురిసే విధంగా ఏర్పాటు చేశారు. వాహనాల్లో పెట్రోల్ పోసుకున్న వారు ఎండల్లో హాయి..హాయి అంటూ కొద్దిసేపు అక్కడే సేదతీరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


