5 స్థానాలు.. 46 మంది పోటీ | - | Sakshi
Sakshi News home page

5 స్థానాలు.. 46 మంది పోటీ

Apr 17 2026 11:02 AM | Updated on Apr 17 2026 11:02 AM

● కో ఆప్షన్‌కు దరఖాస్తుల వెల్లువ ● మూడు రోజులు స్క్రూటినీ ● 15 రోజుల్లోగా ప్రత్యేక సమావేశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ పదవులకు అనూహ్యంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గురువారంతో ముగియగా, ఐదు స్థానాలకు భారీస్థాయిలో 46 మంది దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల పాటు అధికారులు పరిశీలించనున్నారు. 15 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు.

46 మంది దరఖాస్తు

నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్‌ పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐదు స్థానాల్లో రెండు మైనార్టీలు(అందులో ఒకరు మహిళ), మూడు జనరల్‌ (అందులో ఒకరు మహిళ)కు కేటాయించారు. కో ఆప్షన్‌ పదవులకు దరఖాస్తుల స్వీకరణ గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఐదుస్థానాలకు 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. అజీమ్‌ మహమ్మద్‌, నాంపల్లి శ్రీనివాస్‌, నక్క పద్మ, దిండిగాల మహేష్‌, స్వర్గం వజ్ర, కన్న కృష్ణ, చిందం శ్రీనివాస్‌, వరాల నారాయణ, చిగిరి వెంకటమ్మ, లింగంపల్లి శ్రీనివాస్‌, పుట్ట నరేందర్‌, ఎలగందుల నందకుమార్‌, నాగవెల్లి వెంకట రెడ్డి, సుంకిశాల సంపత్‌రావు, గుర్రాల మంగారాణి, సర్ధార్‌ బల్బీర్‌ సింగ్‌, కుర్ర తిరుపతి, గందె మాధవి, దాది సుధాకర్‌, బోనాల శ్రీకాంత్‌, ఆకుల రమేశ్‌, జి.కొమురయ్య, హఫీజాబేగం, జంగిలి సాగర్‌, జంగిలి ఐలేందర్‌ యాదవ్‌, భూక్యా తిరుపతి, భూక్యా లావణ్య, ఎదుల్ల రాజశేఖర్‌, మహమ్మద్‌ అహ్మద్‌ మొహియొద్దీన్‌, అర్ష కిరణ్మయి, అర్ష మల్లేశం, మందల మహేందర్‌రెడ్డి, కమల్‌జిత్‌కౌర్‌, మహమ్మద్‌ అబ్దుల్‌ అహద్‌ నవీద్‌, కొండపల్లి సరిత, సర్ధార్‌ సోహాన్‌సింగ్‌, గుంజేటి శివకుమార్‌, జిట్టవేని కోమలత, మహమ్మద్‌ అబ్బాస్‌, మహమ్మద్‌ అబ్బాస్‌, మహమ్మద్‌ ఖమరుద్దీన్‌, ఆస్మా పర్వీన్‌, సాదిక్‌ సుల్తానా, సయ్యద్‌ అబ్దుల్‌ బషీర్‌, లింగంపల్లి సుజాత, మాతంగి కృష్ణ క్రిస్టోఫర్‌ దరఖాస్తు చేసుకున్నారు.

ఎంపీటీసీలుంటే రిజెక్ట్‌

కో ఆప్షన్‌ పదవులకు వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల పాటు అధికారులు పరిశీలించనున్నారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యుల పదవీ కాలాన్ని పరిశీలిస్తారు. కో ఆప్షన్‌ పదవులకు ఎంపీటీసీలు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని నగరపాలకసంస్థ అధికారులు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని మాజీ సర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు మాత్రమే అర్హులని అన్నారు. కో ఆప్షన్‌ పదవులకు గాను పలువురు ఎంపీటీసీలు కూడా దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది.

పోటీలో ఉండేదెవరో...

ఐదు స్థానాలకు 46 మంది దరఖాస్తు చేసుకొన్నప్పటికీ, పోటీలో ఉండేదెవరనే చర్చ మొదలైంది. 46 మందిలో ఒకరిద్దరు మైనార్టీ, జనరల్‌ కోటా రెండింటిలోనూ దరఖాస్తు చేసుకొన్నారు. కొంతమంది దరఖాస్తు వాపసు తీసుకొనే అవకాశం ఉంది. ఓటింగ్‌ సమయంలో పోటీనుంచి తప్పుకొన్న వారి పేర్లు కూడా చదివివినిపిస్తామని అంటున్నారు.

కాంగ్రెస్‌ దూరం

కో ఆప్షన్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ దూరంగా ఉంది. గురువారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కా ర్పొరేటర్లు భేటీ అయ్యారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను నమ్మి పోటీ చేయలేమని కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి ఎవరూ పోటీచేయడం లేదని అంజన్‌కుమార్‌ తెలి పారు. క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం తక్కువగా ఉండడం కూడా కాంగ్రెస్‌ వెనక్కి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి తొమ్మిది మంది తాజా మాజీ కార్పొరేటర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం. వీరు పోటీలో ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక బీజేపీ నుంచి హఫీజాబేగం, బల్బీర్‌సింగ్‌, కన్న కృష్ణ,నందకుమార్‌, వెంకటమ్మ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement