‘పది’ ఫలితాల్లో రికార్డు సృష్టించాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’ ఫలితాల్లో రికార్డు సృష్టించాలి

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

● కలెక్టర్‌ చిత్రామిశ్రా

చిగురుమామిడి: పదోతరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి, రికార్డు సృష్టించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా సూచించారు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌ ఆదర్శపాఠశాల, చిగురుమామిడి ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రోగులతో మాట్లాడారు. పల్లెదవాఖానాను సందర్శించారు. తమ గ్రామానికి రెండు వీవో భవనాలు మంజూరయ్యాయని, గ్రామంలోని కొందరు నాయకులు స్థలాన్ని రద్దు చేయిస్తున్నారని చిన్న ముల్కనూరు సర్పంచ్‌ సాంబారి భారతమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్‌, డీపీవో జగదీశ్వర్‌, చిగురుమామిడి తహసీల్దార్‌ ముద్దసాని రమేశ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు సిద్ధం చేయండి

కొత్తపల్లి(కరీంనగర్‌): చింతకుంటలోని డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా సూచించారు. ఇండ్ల సముదాయాలను గురువారం పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్లను సంసిద్ధం చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement