తొలిరోజు 256 దరఖాస్తులు
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించింది. మంగళవారం డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. మొదటి రోజు అన్ని డివిజన్ల నుంచి 256 మంది ఆశవాహులు పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఈ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిస్తామని అంజన్‌కుమార్ తెలిపారు. డివిజన్లవారీ గా వచ్చిన పేర్లను పీసీసీకి పంపిస్తామని, పీసీసీ స్క్రీనింగ్ కమిటీ టికెట్లు ప్రకటిస్తుందని అన్నారు.


