మున్సిపల్‌ స్టార్స్‌! | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ స్టార్స్‌!

Jan 21 2026 7:15 AM | Updated on Jan 21 2026 7:15 AM

మున్స

మున్సిపల్‌ స్టార్స్‌!

మున్సిపల్‌ నుంచి చట్టసభలకు ప్రస్థానం

శాసనసభలో అడుగిడిన గంగుల, సోమారం, కోరుకంటి

కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్‌

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం రేపోమాపో అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో సీనియర్లతో పాటు యువ నాయకులున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఒకప్పుడు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఎదిగిన తీరు తోటి రాజకీయ సహచరులకు, రాబోయేతరానికి స్ఫూర్తి నింపింది. పాత జిల్లాలో అనేక మంది స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి శాసనసభ, పార్లమెంటు ఉభయ సభల్లో అడుగు పెట్టారు. అలాంటి వారిలో సీనియర్‌ రాజకీయ నాయకులతోపాటు ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిఽథ్యం వహిస్తున్న వారిపై కథనం. –సాక్షిప్రతినిధి, కరీంనగర్‌

కోరుకంటి చందర్‌: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ రాజకీయ ప్రస్థానం కూడా మున్సిపల్‌ కౌన్సిలర్‌గానే మొదలైంది. 2004లో కౌన్సిల్‌గా గెలుపొందారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సోమారం సత్యనారాయణ: 1998 మున్సిపల్‌ ఎన్నికల్లో రామగుండం మున్సిపల్‌ చైర్మన్‌ (కాంగ్రెస్‌)గా పనిచేసి పలు విజయవంతమైన కార్యక్రమాలు అమలు చేశారు. 2004లో టీడీపీ తరఫున మంథని నుంచి పోటీ చేసి ఓడిపోయినా, 2009లో (ఇండిపెండెంట్‌), 2014లో (బీఆర్‌ఎస్‌ నుంచి) ఎమ్మెల్యేగా రామగుండం నుంచి ప్రాతినిథ్యం వహించారు.

మున్సిపల్‌ స్టార్స్‌!1
1/3

మున్సిపల్‌ స్టార్స్‌!

మున్సిపల్‌ స్టార్స్‌!2
2/3

మున్సిపల్‌ స్టార్స్‌!

మున్సిపల్‌ స్టార్స్‌!3
3/3

మున్సిపల్‌ స్టార్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement