సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కరీంనగర్: పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా ఫెసిలిటేటర్స్‌తో సమీక్షించారు. గర్భిణులకు అనారోగ్య సమస్యలుంటే గైనకాలజిస్టుతో చికిత్స అందించి, సాధారణ ప్రసవానికి ప్రోత్సహించాలన్నారు. 30ఏళ్ల పైబడినవారికి రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయినవారికి మందులు అందించాలన్నారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను పునరావాస కేంద్రానికి పంపించాలన్నారు. పీవో డీటీటీ ఉమా శ్రీ, పీవో ఎంహెచ్‌ఎన్ సన జవేరియా, డీపీహెచ్‌ఎన్‌వో విమల, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మానకొండూర్: తమ గ్రామానికి వెళ్లేలా నేషనల్ హైవే నుంచి సర్వీస్ రోడ్డు వేయాలని మండలంలోని ఈదులగట్టెపల్లి గ్రామస్తులు మంగళవారం ఆర్డీవో మహేశ్వర్‌కు విన్నవించారు. ఈదులగట్టెపల్లి స్టేజీ వద్ద నేషనల్ హైవే 563 పనులను అడ్డుకుంటున్నారు. తమ గ్రామానికి వెళ్లేలా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించారు. మంగళవారం రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు స్టేజీ వద్ద పనులు పరిశీలించగా, గ్రామస్తులు తమ గోడువెళ్లబోసుకున్నారు. సర్వీస్ రోడ్డు ఏ ర్పాటు చేసేదాక పనులు సాగనివ్వమని ఆర్డీవో మహేశ్వర్‌కు తేల్చిచెప్పారు. సర్వీస్ రోడ్డుకు ఎస్సారెస్పీ భూమి అనుకూలంగా ఉందని, పెట్రోలు బంకు వైపు నుంచి సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు అవకాశముందని ఆర్డీవోకు వివరించడంతో స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 2017 పేస్కేల్ బకాయిలు అర్హులకు చెల్లించాలని, ఏఆర్‌బీఎస్‌లైఫ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్ చేయాలని కోరారు. 2021 పే స్కేల్ చేపట్టి జీతం సవరణ చేసి, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రీజియన్ అధ్యక్షుడు కె.చంద్రయ్య, కార్యదర్శి ఎస్.బచన్‌సింగ్ పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: జాతీయస్థాయిలో కరీంనగర్ కీర్తి రెపరెపలాడింది. ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రానికి అక్రిడిటేషన్ సర్టిఫికెట్ లభించింది. సెప్టెంబర్ 16న ప్రత్యేక సాంకేతిక పరిశీలనా బృందం శిక్షణ కేంద్రాన్ని పరిశీలించింది. పాడి పశువులకు కృత్రిమ గర్బధారణపై శిక్షణ, నిపుణులతో బోధన, మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని కేంద్రం సర్టిఫికెట్‌ను ప్రకటించింది. ఈ గుర్తింపు 2028 వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా 80శిక్షణ కేంద్రాలకు గుర్తింపు ఉండగా, కరీంనగర్ కేంద్రానికి ఏ గ్రేడ్ లభించింది. శిక్షణ కేంద్రం అధ్యాపక సిబ్బంది ఎం.కోటేశ్వర్‌రావు, దివ్య, సాయిచైతన్యను జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి నల్ల లింగారెడ్డి అభినందించారు.
విద్యానగర్(కరీంనగర్): ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ జరుగుతాయని డీఐఈవో గంగాధర్ తెలిపారు. ఈనెల 21న ఫస్టియర్, 22న సెకండియర్ విద్యార్థులకు నిర్వహిస్తామ ని వివరించారు. ఇంతకు ముందు జరిగిన పరీ క్షల్లో ఫెయిల్ అయినవారికి 23న నైతికత, మా నవ విలువలు పరీక్ష, పర్యావరణ విద్య పరీక్ష 24న జరుగుతుందని తెలిపారు. ఉత్తీర్ణత సా ధించిన వారికే సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి


