‘విరసం’ మహాసభలను విజయవంతం చేయండి
● కరపత్రం ఆవిష్కరించిన ప్రజా సంఘాల నాయకులు
కరీంనగర్‌టౌన్: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24, 25 తేదీల్లో జరిగే విప్లవ రచయితల సంఘం 30వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మహాసభల కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. మూడు దశాబ్దాలుగా విరసం చురుగ్గా పని చేస్తోందన్నారు. రాజకీయ కుట్ర, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, మేధావులపై నిర్బంధం, నిరసన కారులపై దాడులు వంటి చర్యలతో ప్రభుత్వం ప్రజలపై యుద్ధం చేస్తోందని ఆరోపించారు. మహాసభలకు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మార్వాడి సుదర్శన్, నాస్తిక సమాజం కమిటీ నాయకులు బోస్ బాబు, శశిధర్, సంతోష్, అర్జున్, విజయ్ పాల్గొన్నారు.


