కొనసాగుతున్న కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న నాయకుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగింది. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆశావహుల నుంచి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, మడుపు మోహన్ దరఖాస్తులు స్వీకరించారు. బుధవారం నగరంలోని వివిధ డివిజన్ల నుంచి 72 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 66 డివిజన్లకు గాను పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 312కు చేరింది. నామినేటెడ్ పదవులు కావాలని కూడా కొంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గురువారం మధ్యాహ్నంతో ముగుస్తుందని అంజన్‌కుమార్ తెలిపారు. డివిజన్లవారీగా పేర్లను పీసీసీకి పంపిస్తామన్నారు.
కరీంనగర్‌టౌన్: సీఎం రేవంత్ రెడ్డి రౌడీషీటర్‌లా ప్రవర్తిస్తున్నారని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్‌గౌడ్ అన్నారు. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ను దూషించడంతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని అనడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి సరికాదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మైనారిటీ అధ్యక్షుడు మీర్ షౌకత్ ఆలీ, నాయకులు ఆరే రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, దినేష్, అన్వేష్, విక్రమ్ ఉన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం సరికాదు
సప్తగిరికాలనీ(కరీంనగర్): పీజీ మూడో సెమిస్టర్ విద్యార్థులకు హాజరుశాతం లేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా పరీక్షలకు దూరం చేయడం సరికాదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి అన్నారు. బుధవారం వర్సిటీ ఆవరణలో విద్యార్థులతో మాట్లాడారు. పరీక్ష ఫీజు తీసుకునే సమయంలో అటెండెన్స్ విషయంపై నోటీసు ఇవ్వకుండా.. సమాచారం లేకుండా.. హాల్ టికెట్ తీసుకునే సమయంలో పరీక్షకు అనుమతించకపోవడం సరికాదన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, నాయకులు సందీప్ రెడ్డి, అడప సాయి కృష్ణ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్‌యూ ఫార్మసీ
విభాగాధిపతిగా క్రాంతి రాజు
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కళాశాల విభాగాధిపతిగా క్రాంతిరాజును నియమిస్తూ బుధవారం వీసీ ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ సతీష్ కుమార్ నియామక ఉత్తర్వులు అందించారు. క్రాంతిరాజు 2013లో ఎస్‌యూలోని ఫార్మసీ విభాగంలో చేరారు. పరిశోధనల్లో మూడు పేటెంట్లను రిజిస్టర్ చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆల్‌ఇండియా ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్‌గా, ఫార్మసీ కళాశాల బాలుర వసతి గృహానికి వార్డెన్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు.
అశాసీ్త్రయ పునర్విభజనపై హైకోర్టుకు..
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలోని 35, 36, 55 డివిజన్ల డీలిమిటేషన్ అశాసీ్త్రయంగా జరిగిందంటూ న్యాయవాది కోల సంపత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాపువాడలోని ఒకేచోట ఉండే 5–4–1 నుంచి 5–4–197, 5–5–1 నుంచి 5–5–113, 5–6–1 నుంచి 5–6–123, 5–6–515 నుంచి 5–6–663 ఇళ్లను మూడు డివిజన్లలో చేర్చారని, ఇది పూర్తి గా అశాసీ్త్రయమని కోర్టుకు నివేదించారు. దీని పై విచారించిన హైకోర్టు వారం రోజుల్లో పిటిషనర్ విజ్ఞప్తిని కన్సిడర్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ల డీలిమిటేషన్, ఓటర్ల చేర్పు, రిజర్వేషన్‌ల ఖరారులపై పలువురు వేసిన కోర్టు కేసులు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కొనసాగుతున్న కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ
కొనసాగుతున్న కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ


