నిరంతరాయ విద్యుత్‌కు ట్రాన్స్‌ఫార్మర్లు
కొత్తపల్లి: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే శనివారం కరీంనగర్ టౌన్–1 సబ్ డివిజన్‌లోని టౌన్–3 సెక్షన్‌లో రెండు 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, టౌన్–1లో 160 కే.వీ, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, టౌన్–8 సెక్షన్‌లో 160 కే.వీ ట్రాన్స్‌ఫార్మర్‌ను, టౌన్–2 సబ్ డివిజన్‌లోని టౌన్ 2 సెక్షన్‌లో మూడు 160 కె.వీ., టౌన్–4లో ఐదు 160 కె.వీ. టౌన్–7లో 100 కె.వీ., టౌన్–9 సెక్షన్‌లో రెండు 160 కె.వీ. ట్రాన్స్‌ఫార్మర్లు, కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ తీగలగుట్టపల్లి సెక్షన్‌లో మూడు 160 కె.వీ. ట్రాన్స్‌ఫార్మర్లు, నాలుగు 100 కె.వీ. ట్రాన్స్‌ఫార్మర్లు శనివారం డివిజనల్ ఇంజినీర్ జంపాల రాజంతో కలిసి ఆయన చార్జ్ చేశారు.


