ఇయ్యాల సీపీఐ వందేళ్ల సంబరం
కరీంనగర్‌టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో భారీ ర్యాలీ, బహిరంగ సభను రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, అతిథులుగా సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు.


