అనాథలకు ఆపన్నహస్తం
రామడుగు(చొప్పదండి): అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ, వారికి కొడుకులా వ్యవహరిస్తూ మంచికట్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు దాదాపు 11 మందికి అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన శ్రీనివాస్ ఐదేళ్లుగా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలో స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఆశ్రయం పొంది అనారోగ్యంతో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు సమాచారమిస్తారు. ఎవరూ స్పందించకుంటే తానే మృతదేహాన్ని వెలిచాల గ్రామ వైకుంఠధామానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు చేస్తారు. ఆశ్రమంలో ప్రస్తుతం 35 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.


