గ్రామానికి సర్పంచ్ పండ్ల తోటల వ్యాపారం
ఇల్లంతకుంట(మానకొండూర్): తమ ప్రాంతంలో దొరికే పండ్ల తోటలను కాంట్రాక్ట్ పట్టి వాటిని ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంటాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె గ్రామ సర్పంచ్ చింతమడక కళ్యాణ్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతడికి 4 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంతో పాటు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మామిడి, బత్తాయి తోటలు కాయలుగా ఉన్నప్పుడు గంపగుత్తగా పట్టుకొని పండ్లుగా మారిన తర్వాత వాటిని బొంబయి, నాగపూర్, ఢిల్లీ, హైదరాబాద్.. ఎక్కడ ఎక్కువ రేటు పలికితే అక్కడికి తీసుకెళ్లి అమ్ముతానని కళ్యాణ్ తెలిపారు.
– చింతమడక కళ్యాణ్, సర్పంచ్, చిక్కుడువాని పల్లె


