అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు వృత్తిని నమ్మకుంటూనే ప్రజాసేవకోసం నడుంబిగించారు. ఇంకొందరు నచ్చిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మరికొందరు ఆపదలో మేమున్నామంటూ బయలు దేరుతున్నారు. పలువురు అన్నితామై లాస్ట్ జర్నీ పూర్తిచేస్తున్నారు. ఎవరు ఏ రకంగా ముందుకెళ్తున్నా.. ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్...
పేదలు మృతిచెందితే వారి దహన సంస్కారాలకు బాధిత కుటుంబ సభు్‌ుయ్ల నానా అవస్థలు పడుతున్నారు. నా తాత, తండ్రి పేరు నిలబెట్టాలన్న ఉద్దేశంతో వారి జ్ఞాపకార్థం వైకుంఠయాత్ర రథాలను ఏర్పాటు చేశా. ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు నా వంతు సాయం అందిస్తున్న. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఉంటున్నా సొంతగడ్డను మర్చిపోకుండా మరిన్ని సేవలు అందిస్తా.
– డాక్టర్ మంచాల జ్ఞానేందర్
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతడి తాత మంచాల రాజేశం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవిగా సిరిసిల్ల ప్రాంతంలో సుపరిచుతులు. జ్ఞానేందర్ తాత, తండ్రి శంకరయ్య జ్ఞాపకార్థం 2013లో ‘మంచాల శంకరయ్యగుప్తా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో మరో వాహనం ఏర్పాటు చేసి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా తన సేవలను ప్రారంభించారు. ఎవరైనా పేదలు మృతిచెందినా ఇదే వాహనంపై అంతిమయాత్ర చేస్తారు. వీటితో పాటు బాడీఫ్రీజర్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. పైగా బాధితులు అత్యంత పేదలని తెలిస్తే 50 మందికి సరిపడా భోజనం కూడా పంపిస్తారు. ఇలా ఇప్పటి వరకు సిరిసిల్ల, హైదరాబాద్, నిజామాబాద్‌లో సుమారు 21,280 పేద కుటుంబాలకు చెందిన మృతదేహాలను తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేశారు. అలాగే వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు. కాలనీల్లో వాటర్‌ట్యాంకర్లతో నీటి సరఫరా, వినాయక చవితికి మట్టి విగ్రహాల పంపిణీ, అనాథలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ తదితర కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా చేపడుతున్నారు. ఇతడి సేవలను గుర్తించి అమెరికాలోని కాలిఫోర్నియా యునైఎడ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు 2016లో డాక్టరేట్ ప్రదానం చేశారు. 2018లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జ్ఞానేందర్‌కు ఉత్తమ సేవా పురస్కారాన్ని కలెక్టర్ అందించారు. 2017లో మహానటి సావిత్రి సేవా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సామాజిక సేవకుడిగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారు.
జ్యోతినగర్(రామగుండం): ‘మాయమైపోతున్నడమ్మా..మనిషన్న వాడు’ అని తన సెల్ ఫోన్‌కు కాలర్ ట్యూన్ పెట్టుకుని పేదల ఆఖరి మజిలీకి మడిపల్లి మల్లేశన్న ఆప్తుడిగా నిలిచాడు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మల్లేశ్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి కరోనా సమయంలో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని 20 వేల మంది పేదలకు నిత్యవసర సరుకులు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. అలాగే నిరుపేదలు మృతి చెందితే వారి ఆఖరి మజిలీకి పాడెకట్టెలు, బాధిత కుటుంబాలకు భోజనం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 600 మందికి పైగా మృతిచెందిన పేదలకు పాడెకట్టెలు అందించి తన నిస్వార్థ సేవలను కొనసాగిస్తున్నాడు. అనాథ శవాల అంత్యక్రియలు చేయడంలోనే ముందు వరుసలో నిలిచి సేవలు అందిస్తున్నాడు.
జ్ఞానేందర్ ఏర్పాటు చేసిన స్వర్గలోకయాత్ర రథం
కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై న ముదాం రవి చాలా ఏళ్లుగా ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచినప్పటి నుంచి ఉదయం వేళ గ్రామంలోని వాడల్లో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటారు. తర్వాత ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలని సర్పంచ్‌గా బరిలో ఉండి గెలిచానని, ఉపాధిపరంగా ఎలక్ట్రికల్ షాపులో ఉండి విక్రయాలు జరిపితేనే సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!


