అనాథ శవాలకు అన్నీ తానై..
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణా నికి చెందిన రాచమల్ల శేఖర్ ‘సర్వ్ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ పేరిట సమాజ సేవ చేస్తున్నారు. ఈయన అంబులెన్స్ సర్వీస్ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కోవిడ్ సమయంలో రోగులను అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించారు. ఆ సమయంలో హైదరాబాద్ గాంధీ, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కోవిడ్‌తో మృతిచెందిన వారిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శేఖర్‌కు అనాథ శవాలకు అంత్యక్రియలు చేయాలని ఆలోచన వచ్చింది. 2020లో సర్వ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయినప్పుడు రైల్వే, సివిల్ పోలీసులు సమాచారం అందిస్తే మృతదేహాలను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. గుర్తు తెలియని మృతులకు సంబంధించి ఎవరూ రాకుంటే అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్, ఆలయాల వద్ద యాచకులకు దుప్పట్ల పంపిణీ, ఉచిత భోజనం అందిస్తున్నారు. ఇతడితో పాటు చందా సంతోష్, రామకృష్ణ సహాయకులుగా వ్యవహరిస్తూ సమాజ సేవ చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయినప్పుడు పోలీసులు సమాచారం అందించేవారు. మృతదేహాలను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో పెట్టెవాన్ని. గుర్తు తెలియని మృతులకు సంబంధించి ఎవరూ రాకుంటే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 90 అనాథ శవాలకు అంత్యక్రియలు చేశాను.
– రాచమల్ల శేఖర్, సర్వ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్, జమ్మికుంట
అనాథ శవాలకు అన్నీ తానై..


