బ్రెయిలీ లిపితోనే చదువు
బ్రెయిలీ లిపి లేకుంటే మాలాంటి వారి పరిస్థితి వేరేలా ఉండేది. బ్రెయిలీ లిపితో చదువుకొని జ్ఞానాన్ని పొందుతున్నాం. మా స్కూల్‌లో బ్రెయిలీ లిపి నేర్చుకున్న టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ భాషలను బ్రెయిలీ లిపిలో సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు.
– ఎ.నిత్య, 3వ తరగతి
చిన్నప్పటి నుంచి నాకు చూపు లేదు. అయినా కళ్లు లేవని బాధ లేదు. బ్రెయిలీ లిపితో చదువుకున్న నుంచి అందరిలాగే పుస్తకాల్లోని పాఠాలను స్పర్శతో చదువుతున్నా. మాది అంధుల పాఠశాలే అయినా.. విద్యతోపాటు సంగీతం, పాటలు, ఆటలు నేర్పిస్తున్నారు.
– వి.దుర్గ, 2వ తరగతి
బ్రెయిలీ లిపిలోనే పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నా. మంచి మార్కులు తెచ్చుకుంటా. మా టీచర్లు అండగా ఉంటున్నారు. బోర్డు ఎగ్జామ్‌లో స్క్రయిబ్ సిస్టమ్ ఉంటుంది. నేను చెబుతుంటే 9వతరగతి చదివేవారు నా ఎగ్జామ్ రాస్తారు.
– జి.సాయిరాం, 10వ తరగతి
బ్రెయిలీ లిపితోనే చదువు
బ్రెయిలీ లిపితోనే చదువు


