
భవాని దీక్ష స్వీకరణ
కరీంనగర్‌కల్చరల్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సోమవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో భవాని దీక్ష స్వీకరించారు. ఆయన కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల ద్వారా దీక్షా కంకణాన్ని ధరించారు. ఈసందర్భంగా ప్రజలకు ముందస్తు దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సేవలు ఎలా ఉన్నాయి?
కరీంనగర్‌క్రైం: జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి వెంకటేశ్ సోమవారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, గంజాయి, నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయన్నారు. విచారణ ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, జైలు రమేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
జమ్మికుంట(హుజూరాబాద్): దళారులకు పత్తి అమ్మి రైతులు ఆర్థికంగా నష్ట పోవద్దని, నాణ్యమైన పత్తిని మార్కెట్ తీసుకొచ్చి మంచి ధర పొందాలని మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం అన్నారు. సోమవారం మార్కెట్‌లో క్రయ విక్రయాలను పరిశీ లించి మాట్లాడారు. సీసీఐకి పత్తి అమ్ముకునే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా, మార్కెట్‌లో క్వింటాల్ కొత్త పత్తి గరిష్ట ధర రూ.6,222 పలి కింది. 29 వాహనాల్లో 106 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకవచ్చారు. క్వింటాల్‌కు మో డల్ ధర రూ. 5,521, కనిష్ట ధర రూ.3,200 వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
పోక్సో కోర్ట్ స్పెషల్ పీపీగా రాజేశం
కరీంనగర్‌క్రైం: పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు–2 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది మంచికట్ల రాజేశం నియమితలయ్యారు. సోమవారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శరత్ సమక్షంలో విధుల్లో చేరారు.

భవాని దీక్ష స్వీకరణ

భవాని దీక్ష స్వీకరణ

భవాని దీక్ష స్వీకరణ