
ఇక సంగ్రామమే..
ఎంపీపీ వివరాలు
సర్పంచ్‌ల వివరాలు
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్
కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్)
సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్)
జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్)
పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గతంకు భిన్నంగా...
ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు.
ముగ్గురు పిల్లలుంటే అనర్హులే..
కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది.
కోర్టులో ఉండడంతో..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం
కరీంనగర్ 03 00 06 06 15
సిరిసిల్ల 03 01 05 03 12
జగిత్యాల 04 01 08 07 20
పెద్దపల్లి 05 03 00 05 13
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం
సిరిసిల్ల 53 30 101 76 260
జగిత్యాల 68 31 153 133 385
పెద్దపల్లి 54 06 110 93 263
కరీంనగర్ – – – – –
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం
కరీంనగర్ 39 00 73 58 170
సిరిసిల్ల 25 07 56 35 123
జగిత్యాల 26 07 52 41 126
పెద్దపల్లి 25 03 59 50 137