
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉపాధి
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బాసటగా నిలువాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లనిర్మాణాలకు ఉపాధి హామీ పథకా న్ని అనుసంధానించింది. జాబ్‌కార్డు ఉన్నవారికి 90 రోజులు పని కల్పించి అ వేతన డబ్బులు వారి ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదా రుకు జాబ్‌కార్డు ఉంటే రోజు కూలీ రూ.307కు గానూ గరిష్టంగా 90 రోజుల ఉపాధి పనులకు రూ.27,630 ఖాతాలో జమ చేస్తారు. స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.12వేలు అందించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు రాగా జిల్లాలో 542 మంది లబ్దిదారులకు జాబ్ కార్డులున్నట్లు తేలింది.
వివిధ దశల్లో చేయూత
జిల్లాలో 8,219 లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేసింది. 30శాతం మంది పనులు ప్రారంభించారు. జాబ్‌కార్డు ఉన్నవారికి ఉపాధి హామీ పఽథకం కింద ఇందిరమ్మ ఇల్లు పునాదిస్థాయి వరకు 40రోజులు, స్లాబ్ వేసేవరకు 50 పని దినాలు మొత్తం 90 రోజులు పనులు కల్పిస్తారు. వేతన చెల్లింపులకు నిర్మాణ పనుల్లో మూడుస్థాయిల్లో లబ్ధిదారు ఫొటోలను తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తే లబ్ధిదా రు ఖాతాలో వేతన డబ్బులు జమవుతాయి.