
పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు
● పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్/కరీంనగర్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి చేయాలన్నా రు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నవంబర్ 11 వరకు ప్రక్రియ పూర్తి కానుందని వివరించారు. జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. నామినేషన్ నుంచి ఓటింగ్, ఫలితాల వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, డీపీవో జగదీశ్, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్, కలెక్టరేట్ ఏవో సుధాకర్ పాల్గొన్నారు.
బతుకమ్మ నిమజ్జనం పాయింట్ల పరిశీలన
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో సద్దుల బతుకమ్మ పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నగరంలోని రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, మానేరు డ్యాం, మార్కండేయనగర్, గౌతమీనగర్, లేక్ పోలీస్‌స్టేషన్, వేదభవన్, గోపాల్‌పూర్ తదితర ప్రాంతాల్లోని బతుకమ్మ నిమజ్జనం పాయింట్లను తనిఖీ చేశారు. ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద లైటింగ్, బారికేడింగ్, తాగు నీటి సౌకర్యం సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. సద్దుల బతుకమ్మను నగరవాసులు ఘనంగా జరుపుకొన్నారని ఆయన తెలిపారు. కమిషనర్ వెంట ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ యాదగిరి తదితరులు ఉన్నారు.
రోడ్డుపై చెత్త.. హోటల్‌కు జరిమానా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డంపర్‌బిన్ల వద్ద రోడ్డుపై చెత్త వేస్తున్న హోటల్ నిర్వాహకులకు నగరపాలకసంస్థ అధికారులు సోమవా రం జరిమానా విధించారు. నగరంలోని పలు చోట్ల డంపర్‌బిన్లు, అండర్ బిన్ల వద్ద రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోంది. యూజర్ చార్జీలు చెల్లించి, నగరపాలకసంస్థ వాహనాల్లో చెత్త వేయాల్సి ఉండగా, కొంతమంది వ్యాపారులు ఆటోల్లో చెత్త తీసుకువచ్చి డంపర్‌బిన్ల వద్ద రోడ్లపై పడవేస్తున్నారు. బస్‌స్టేషన్ వెనుకాల ఉన్న డంపర్‌బిన్ వద్ద రోడ్డుపై చెత్త వేస్తున్న లావిస్ మండి హోటల్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు నగరపాలకసంస్థ వైద్యాధికారి సుమన్ తెలిపారు. జరిమానా రశీదును హోటల్ నిర్వాహకులకు అందించారు.
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలి చాల రాజేందర్‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రావుతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం క రీంనగర్ నియోజకవర్గానికి 4వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, అదనంగా మరో 4వేల ఇళ్లు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. దసరా పండుగ అనంతరం ల బ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. నాయకులు కూర నరేశ్‌రెడ్డి, బుర్ర స్వామి, నారా యణ, మడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు