
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం సంజయ్ పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు.
మార్క్‌ఫెడ్ ఎదుట బీఆర్‌ఎస్ నిరసన
కరీంనగర్: జిల్లాకేంద్రంలోని రాంనగర్‌లో ఉన్న మార్క్‌ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమం నిర్వహించకుండా గేటుకు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. హరిశంకర్ మాట్లాడుతూ.. 15ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ కావాలని అడ్డుకోవా లని చూస్తోందన్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీన్ని జరిపే బాధ్యత గణేశ్ ఉత్సవకమిటీదని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్ డీఎంకు సుడా చైర్మన్‌తో పాటు మంత్రి ఫోన్ చేసి వేడుకలు జరపకుండా చూడాలని ఆదేశించినట్లు ఆరోపించారు. వందలాది మంది పోలీసులను మోహరించినా కార్యక్రమం జరుగుతుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకులు పొన్నం అనిల్ కుమార్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రెడ్డవేణి మధు, తిరుపతి నాయక్, బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు.
రాంలీలాపై బీఆర్‌ఎస్ రాద్ధాంతం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మార్క్‌ఫెడ్ మైదానంలో నిర్వహించే రాంలీలా కార్యక్రమంపై బీఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తే ఊరుకోమని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. రాంలీలా జరగకుండా మార్క్‌ఫెడ్ మైదానానికి తాళం వేశారని, కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారంటూ బీఆర్‌ఎస్ ఆందోళనచేయడాన్ని తప్పుపట్టారు. దసరా పండుగ రోజు కూడా రాజకీయ లబ్ధికి బీఆర్‌ఎస్ నాయకులు పాకులాడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రావణాసుర విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం ఇవ్వలేదని మార్క్‌ఫెడ్ అధికారులు గేట్‌కు తాళం వేశారని తెలి పారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను బాధ్యులను చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించాల్సి ందేనని స్పష్టం చేశారు. రాంలీలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరపాలకసంస్థ తరపున మార్క్‌ఫెడ్ మైదానంలో ఏర్పాట్లు చేసేది తమ ప్రభుత్వమేనన్నారు. అందరం కలిసి ప్రోటోకాల్ పాటించి, రాంలీల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు.
మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తాం
హుజూరాబాద్ : హుజూరాబాద్ గడ్డపై మరో సారి గులాబీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ 42శాతానికి పెంచడానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నా రు. రైతులకు కనీసం యూరియా అందించని ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన భూమి ఎస్సారెీస్పీది కాదన్నారు. ఎన్నికల కోసం ఈనెల 4న వీణవంక, హుజూరాబాద్, 5న ఇల్లందకుంట, జమ్మికుంట, 6న కమలాపూర్ మండలాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ