
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్ని కల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పనులపై విస్తృతస్థాయిలో ప్రచారం చే యాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలన్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కరీంనగర్ కు వస్తున్నారని తెలిపారు. బాస సత్యనారాయణరావు, సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.