
చెక్‌పోస్టులు.. ముమ్మర తనిఖీలు
● స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతవరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. మంగళవారం కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకంగా ఎన్నికల సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఆరు అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అ న్నారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. రౌడీషీటర్లను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేస్తామన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు వెంట తీసుకెళ్తే సీజ్ చేస్తామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు ఎంపికై న పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ అల్లర్లు జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న దసరా పండుగ సందర్భంగా రామ్‌లీలా మైదానాలు, దుర్గామాత నిమజ్జన కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని తెలిపారు.