
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన బొల్లి విద్యాసాగర్(37) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. కొంతకాలంగా విద్యాసాగర్‌కు మానసిక పరిస్థితి సరిగా లేక మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఈనెల 1న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంతుదూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు.
ఎలిగేడులో ఒకరు..
ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తీగల నరేశ్(32) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు.. నరేశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగితే ఎలా అని ఈనెల 2న అతడి భార్య మమత మందలించగా మనస్తాపానికి గురయ్యాడు. అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు గడ్డి మందు తాగానని చెప్పడంతో వెంటనే చికిత్సకోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నరేశ్‌కు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కొడుకు చేతిలో గాయపడిన తండ్రి..
రాయికల్: కొడుకు చేతిలో గాయపడిన పట్టణానికి చెందిన చిట్యాల లక్ష్మీనర్సయ్య (55) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. గత నెల 29న నర్సయ్యపై ఆయన కొడుకు రాజేందర్ కత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్యను జగిత్యాల.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. చాతిలో తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. నర్సయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. నర్సయ్యపై దాడి చేసిన కొడుకు రాజేందర్‌తోపాటు సహకరించిన అస్లాంను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం
కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట రెవెన్యూ పరిధిలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలినట్లు కొత్తపల్లి ఎస్సై సంజీవ్ తెలిపారు. 50–55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచామని, వ్యక్తికి సంబంధించి ఆచూకీ తెలిస్తే కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి