వేములవాడ: ‘శివయ్యా.. మా కష్టాలు తీర్చయ్యా’.. అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన 35 వేల మంది భక్తులు ఆదివారం రాజన్నను దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను మహారాష్ట్ర రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వార్ (ఐఏఎస్) ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారికి రూ.30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
శివయ్యా... దండాలయ్యా
శివయ్యా... దండాలయ్యా