
‘ఇంటింటికీ బీజేపీ’ని విజయవంతం చేయండి
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుమేరకు జిల్లాలో తలపెట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వీణవంక మండలం బేతిగల్‌లో మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ– ప్రతీ ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టిన కార్యాచరణగా తెలిపారు. ప్రతీ బూత్ కమిటీ అధ్యక్షుడు కనీసం 100 ఇళ్లను సందర్శించి, ప్రధాని మోదీ సందేశం అందించాలనన్నారు. మద్దతు తెలిపేందుకు 92400 15366 మిస్డ్‌కాల్ నంబర్ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహారాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గొట్టుముక్కుల సంపత్‌రావు కిషన్, ప్రధాన కార్యదర్శి మాడుగురి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల మానవహారం
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం మార్చి 2025లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర పెన్షనర్డ్ సమాఖ్య న్యూఢిల్లీ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన అల్ ఇండియా పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కరీంనగర్‌లోని టవర్ సర్కిల్‌లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల రామేశం మాట్లాడుతూ నూతన పెన్షన్ చట్టం రద్దు చేయాలని, కరోనా సమయంలో రావల్సిన 36 నెలల కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పెన్షనర్ల కన్నా కేంద్ర పెన్షనర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరీంనగర్‌లో కేంద్ర ఆరోగ్య పథకం ద్వారా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పెన్షనర్లు మంచికట్ల లక్ష్మిపతి, కొండపాక చంద్రమోహన్‌రావు, యస్వాడ చంద్రమౌళి పాల్గొన్నారు.
కేసీఆర్‌కు కొనసాగింపే రేవంత్‌రెడ్డి పాలన
కరీంనగర్: కేసీఆర్ ప్రభుత్వానికి కొనసాగింపుగానే రేవంత్‌రెడ్డి పాలన ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికార జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్– రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలు రాజ్యాధికారం సాధించడమే అసలైన తెలంగాణ అన్నారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ కేవలం ‘వెలమ–రెడ్డి’ వర్గాలకు సంబంధించినదే అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసం యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అణగారిన వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభమైందని, అతి త్వరలో కరీంనగర్‌కు రాబోతున్న యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు రాఘవేంద్ర ముదిరాజ్, వినోద్ యాదవ్, సభ్యులు శ్రీకాంత్, రాము యాద వ్, కార్తీక్ ఏకలవ్య, బీసీ సంఘాల నాయకులు రణధీర్ సింగ్, విశ్వం, కాంతక్క, లక్ష్మీ, నరేశ్ యాదవ్, నరేశ్, మనోజ్‌గౌడ్ పాల్గొన్నారు.

‘ఇంటింటికీ బీజేపీ’ని విజయవంతం చేయండి

‘ఇంటింటికీ బీజేపీ’ని విజయవంతం చేయండి