
గుండెల్లో డుగ్గుడుగ్గు
తిమ్మాపూర్‌లోని రామగుండం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కొందరు కళాశాల కుర్రాళ్లు ఖరీదైన బైక్‌లపై చక్కర్లు కొట్టారు. భారీ శబ్దాలు వచ్చే బైక్‌లతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. బైక్‌పై ఫీట్లు వేస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. వారు నడిపే బైక్‌ల నుంచి వచ్చే శబ్దం కిలోమీటర్ వరకు వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చినా తీరుమారడం లేదంటున్నారు.
కరీంనగర్‌లోని ఓ కాలనీలో ఒకరోజు రాత్రి 11 గంటలకు కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చే బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారు. నాలుగైదు బైక్‌లపై తిరుగుతూ చెవులు పగిలిపోయేలా సౌండ్ చేస్తూ.. ఇబ్బందులకు గురిచేశారు. నిద్రపోతున్న కాలనీవాసులు ఏం జరుగుతుందోనని రోడ్లపైకి వచ్చారు. సదరు యువకులను ప్రశ్నించేలోపే అక్కడి నుంచి జారుకున్నారు.
బైక్‌లకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు ప్రధానరోడ్లు.. గల్లీల్లో యువత స్టంట్లు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు కొరడా ఝులిపిస్తున్న పోలీసులు నగరంలో ఇటీవల 243 వాహనాలు పట్టివేత, జరిమానా విధింపు

గుండెల్లో డుగ్గుడుగ్గు