
ఇక్కడ ఇలా.. అక్కడ అలా !
ఇల్లంతకుంట/వీర్నపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో వింత పరిస్థితి ఉంది. విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేకపోగా.. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు రావడం లేదు. ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ ప్రాథమికోన్నత పాఠశాలలోని ఏడు తరగతుల్లో 70 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఒకరు ఎస్జీటీ, మరొకరు సోషల్ స్కూల్ అసిస్టెంట్. ఇంకొకరు లాంగ్‌లీవ్‌లో వెళ్లారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 22 మంది కాగా.. ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పదో తరగతిలో ఒకే ఒక విద్యార్థి ఉన్నారు. గురుకులం, కస్తూర్భా, మోడల్‌స్కూళ్లకు వెళ్తుండడంతో గ్రామాల్లోని హైస్కూళ్లలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఉపాధ్యాయులు తెలిపారు.
సిరికొండలో 70 మందికి ఇద్దరు టీచర్లు
గర్జనపల్లిలో 22 మందికి ఆరుగురు ఉపాధ్యాయులు

ఇక్కడ ఇలా.. అక్కడ అలా !