
స్థానిక సంస్థల్లో కాషాయ జెండా ఎగరాలి
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు ● బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు
కరీంనగర్‌టౌన్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని, కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కోరారు. బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన సోమవారం కరీంనగర్‌లోని శుభమంగళ గార్డెన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధర్మారావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శక్తి చెప్పడానికి సమయం ఆసన్నమైందన్నారు. గ్రామాలు, మండలాల్లో జరిగే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అడ్డగోలు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెట్టిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంటే, నేడు ఆ సర్పంచుల గోడు పట్టించుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందన్నారు. పార్టీ నాయకులు బాస సత్యనారాయణరావు, యాదగిరి సునీల్‌రావు, కోమల ఆంజనేయులు, గుగ్గిళ్లపు రమేశ్, బంగారు రాజేంద్రప్రసాద్, మేకల ప్రభాకర్, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, వాసాల రమేశ్, కన్నెబొయిన ఓదెలు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, బోయినపల్లి ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.