
సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ
కరీంనగర్‌టౌన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ సూచించారు. శుక్రవారం బుట్టి రాజారామ్ కాలనీ ఆరోగ్యకేంద్రంలో మహిళా హెల్త్ క్యాంపు పరిశీలించి అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడారు. హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేసి, ల్యాబోరేటరీ, ఫార్మసీ స్టోర్స్‌లో మందుల నిల్వలు పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లోని అధిక రక్తపోటు, డయాబెటిస్ రోగులను పరీక్షిస్తున్న విధానాన్ని వివరాలను, మందుల వివరాల నమోదు రికార్డులను పర్యవేక్షించారు. ఆరెపల్లి బస్తీ దవాఖానా సందర్శించి హాజరు పట్టిక, ఎన్సిడీ రికార్డులు, ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. సనజ వేరియా, లావణ్య, రవళి పాల్గొన్నారు.