యుద్ధ క్రీడ వుషు | - | Sakshi
Sakshi News home page

యుద్ధ క్రీడ వుషు

Jun 17 2025 5:38 AM | Updated on Jun 17 2025 5:38 AM

యుద్ధ

యుద్ధ క్రీడ వుషు

● గ్రామాల్లో ఆదరణ తెచ్చేందుకు ప్రణాళికలు ● క్రీడా కోటను వర్తింపజేయాలని విన్నవించాం

● ‘సాక్షి’తో వుషు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌కుమార్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ప్రాచీన యుద్ధ క్రీడ.. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది వుషు క్రీడ అని రాష్ట్ర క్రీడా వుషు సంఘం ప్రధాన కార్యదర్శి జాల మనోహర్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో వుషు క్రీడ అభివృద్ధికి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యకలాపాలు, 2025–26 సంవత్సరంలో నిర్వహించే పోటీల క్యాలండర్‌, పలు అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు.

2025–26 సంవత్సర క్రీడా క్యాలండర్‌..

2025–26 క్రీడా క్యాలండర్‌ను ప్రస్తుతానికి రూపొందించాం. పలు జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌, బాలబాలికల, పురుషుల, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తాం. జూలైలో సబ్‌ జూనియర్స్‌, ఆగస్టు 2వ వారంలో జూనియర్స్‌, సెప్టెంబర్‌ మొదటి వారంలో సీనియర్స్‌ పోటీలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించాం.

అకాడమీల ఏర్పాటుకు..

రాష్ట్రంలో వుషు క్రీడను విస్తరించడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో అకాడమీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ క్రీడా ప్రాధికారిక సంస్థ, తెలంగాణ ఒలింపిక్‌ సంఘాన్ని కోరాం. అలాగే జిల్లా కేంద్రంలోని స్టేడియాల్లో వుషు కోచ్‌లను నియమించాలని విన్నవించాం. చాలా మంది క్రీడాకారులు వుషులో ఇప్పటికే ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ పూర్తి చేసి ఉన్నారు. వారి ఉపాధి కోసం కోచ్‌లుగా నియమించాలని కోరాం.

క్రీడా కోటాలో అవకాశమివ్వాలి..

బాక్సింగ్‌, రెజ్లింగ్‌, జూడో, కిక్‌ బాక్సింగ్‌, కరాటే, డ్యాన్స్‌, జిమ్నాస్టిక్స్‌ లాంటి క్రీడల సమూహమే వుషు. పై క్రీడలన్నీ వుషులో కనిపిస్తాయి. అలాగే యూత్‌ ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, ఏషియన్‌ గేమ్స్‌లలో వుషు క్రీడ ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వుషు క్రీడలో రాణించినవారికి క్రీడా కోటా అమలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో క్రీడా కోటను వర్తింపజేయాలని ఇటీవల శాట్స్‌, ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులకు విన్నవించాం. ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌, ఎస్‌ఎస్‌బీ, రైల్వే, పోలీస్‌ తదితర సంస్థలు వుషు జట్లను వివిధ పోటీలకు పంపిస్తున్నాయి.

ఇక నుంచి గ్రామాల్లో..

వుషు క్రీడను గ్రామగ్రామాన విస్తరించడానికి సంఘం ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నాం. వుషులో రాణించిన వారు ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారనే పేరుంది. జిల్లాల్లోని సీనియర్‌ క్రీడాకారులు, కోచ్‌లు, సంఘం బాధ్యులను ఏకతాటిపైకి తెచ్చి గ్రామగ్రామాన వుషు క్రీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వుష క్రీడకు ఆదరణ తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.

యుద్ధ క్రీడ వుషు1
1/1

యుద్ధ క్రీడ వుషు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement