సరస్వతీ పుష్కరాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
సుల్తానాబాద్(పెద్దపల్లి): సరస్వతీ పుష్కరాలకు కరీంనగర్ రీజియన్ నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమాన్ తెలిపారు. జిల్లాలోని పలు బస్టాండ్‌లను ఆయన గురువారం సందర్శించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు, వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్‌లు భానుకిరణ్, భూపతిరెడ్డి, డిపో మేనేజర్ ఇందిర, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


