టిప్పర్ ఢీ.. ఒకరు దుర్మరణం
తిమ్మాపూర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ ప్రధాన చౌరస్తాలో ఆదివారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అతివేంగా దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా.. వేల్పుల లచ్చయ్య(49) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అల్గునూర్‌కు చెందిన లచ్చయ్య తన మోటార్ సైకిల్‌పై కరీంనగర్ వైపు వెళ్తుండగా.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంకర టిప్పర్(నంబర్ ఏపీ16టీజే5716) డ్రైవర్ అతివేగంతో, అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ లచ్చయ్య నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. లచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉండగా.. స్థానికుడైన శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటోలో కరీంనగర్‌లోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం లచ్చయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య రాజవ్వ ఫిర్యాదు చేయగా.. ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
టిప్పర్ ఢీ.. ఒకరు దుర్మరణం


