మహిళల భద్రతకు షీటీం
కరీంనగర్‌క్రైం: మహిళలు, బాలికల భద్రతకు కరీంనగర్ కమిషనరేట్‌లోని షీటీం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. గడిచిన నెల రోజుల్లో మహిళలను వేధిస్తున్న వారిపై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 15మందికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. 65 హాట్‌స్పాట్లలో నిఘా ఉంచామని, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 16మంది పోకిరీలను పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించడం జరి గిందన్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న వారు టీసేఫ్ యాప్ వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీటీం 8712670759 నంబర్‌కు లేదా డయల్ 100కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని సూచించారు.


