కరీంనగర్‌టౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ జెండాఊపి ర్యాలీ ప్రారంభించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళా సిబ్బందికి ఆరోగ్య మహిళ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ... తల్లీబిడ్డల ఆరోగ్య రక్షణను ప్రభుత్వం, ప్రజలు బాధ్యతగా స్వీకరించడం అవసరమన్నారు. స్త్రీ సురక్షిత గర్భధారణ, నాణ్యమైన ప్రసూతి ప్రతీ స్త్రీ ప్రాథమిక హక్కన్నారు. కార్యక్రమంలో వైద్యులు సుధా, ఉమాశ్రీ, సాజిదా, శైలేంద్ర కుమార్, సన జవేరియా, రాజగోపాల్, విమల, స్వామి, ప్రణీత, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ. 7,550
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు.
మామిడి తోటలను కాపాడుకోండి
జగిత్యాలఅగ్రికల్చర్/మల్యాల: మామిడి తోట లకు ఆశిస్తున్న పురుగులను నివారించేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పర్యటించి, తోటలను పరిశీలించారు. ప్రస్తుతం మామిడికాయ వృద్ధి చెంది, టెంక గట్టిపడే దశలో ఉన్నాయని, పలు తోటల్లో తామర పురుగు ఉధృతిని గమనించినట్లు తెలిపారు. పురుగుల ఉధృతిని బట్టి లీటరు నీటిలో వేపనూనె 3మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం ఫిప్రోనిల్ 80శాతం డబ్ల్యూజీ 0.2 గ్రాములు, లేదా స్పైనోసాడ్ 45శాతం ఎస్‌సీ 0.3 మిల్లీ లీటర్లు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, సింథటిక్ పైరిత్రాయిడ్ కీటకనాశినిలను ఉపయోగించవద్దని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా శాస్త్రవేత్త డాక్టర్ వై.వెంకన్న, ఫామ్ మేనేజర్ బండారి నరేశ్, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎ.నితీశ్, ఉద్యాన అధికారి మహేశ్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
జమ్మికుంట: మండలంలోని కోరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థి వనరస్ సుశాంత్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జిట్టబోయిన శ్రీను సోమవారం తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలెక్షన్ ట్రయల్స్‌తో అత్యంత ప్రతిభ కనబరిచాడని, 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒడిశా కెయిన్ జార్ స్టేడియంలో జరిగే 39వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారని, విద్యార్థి ఎంపిక పట్ల హెచ్‌ఎం మిడిదొడ్డి సమ్మయ్య, ఎంఈవో హేమలత, ఉపాధ్యాయులు రాజయ్య, దేవదాస్, ప్రకాశ్, శ్రీనివాస్, నరహరి, రాజు, రవికాంత్ రాజ్, శ్రీనివాస్‌రెడ్డి, పద్మ, సంపత్, శ్రీమాన్, గీత గ్రామస్తులు అభినందించారు.
మామిడి తోటలను కాపాడుకోండి


