47 పెండింగ్‌ చలాన్ల వాహనం పట్టివేత | Sakshi
Sakshi News home page

47 పెండింగ్‌ చలాన్ల వాహనం పట్టివేత

Published Sat, Apr 20 2024 1:45 AM

-

జగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్‌, ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రాయికల్‌ మండలంలోని కిష్టంపేటకు చెందిన జనార్దన్‌ తన బైక్‌పై వస్తుండగా ఆపారు. ఆ వాహనంపై 47 పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లు గుర్తించి, సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో యజమాని జనార్దన్‌ మొత్తం రూ.12,805 చెల్లించి, సంబంధిత రసీదును పోలీసులకు అందజేయడంతో వాహనాన్ని అప్పగించారు.

రూ.12,805 చెల్లించిన యజమాని

Advertisement
 
Advertisement
 
Advertisement