రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి నిజామాబాద్ వైపు వస్తున్న మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారులోని భార్యాభర్తలు, మరో కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
ఎల్లమ్మ ఆలయంలో చోరీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు వస్తువులను అపహరించుకుపోయారు. హుండీని గడ్డపారతో పెకిలించి అందులోని డబ్బులను దోచుకెళ్లారు. హుండీని, పగుల గొట్టిన తాళాలను ఆమడ దూరంలో పడేశారు. ఈ విషయమై గౌడ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


