గడ్కోల్‌లో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గడ్కోల్‌లో ఒకరి ఆత్మహత్య

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

గడ్కోల్‌లో ఒకరి ఆత్మహత్య

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన దొమ్మాటి నితిన్‌ గౌడ్‌ (27) అనే యువకుడు కొన్ని రోజులుగా తమకు గ్రామంలో సొంత ఇల్లు లేదని, ఎంబీఏ చదువుకున్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని మానసికంగా బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం లొంక ఆలయానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో లొంకతండా దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement