ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే కూల్చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే కూల్చేస్తాం

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

కామారెడ్డి టౌన్‌ :మున్సిపాలిటీకి సంబంధించిన ప్ర భుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వా టిని తక్షణమే కూల్చివేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ టి.పర్వతాలు హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలోని వీక్లీమార్కెట్‌ రోడ్‌లో ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఆయన టౌన్‌న్‌ప్లానింగ్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మాణం చేపడుతున్న వ్యక్తులతో కమిషనర్‌ మాట్లాడారు. తా ము ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టడం లేదని సదరు వ్యక్తి చెప్పడంతో నిర్మాణానికి సంబంధించిన మున్సిపల్‌ అనుమతి పత్రాలు, స్థల డాక్యుమెంట్‌లను తక్షణమే చూపించాలని కమిషనర్‌ ఆదేశించారు. ఇక్కడి సర్వే నంబర్‌ 6 ప్రభుత్వానికి సంబంధించినదని, ఇందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయితే కచ్చితంగా కూల్చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా భవన ని ర్మాణానికి సంబంధించిన అన్ని పత్రాలను మున్సిపల్‌ కార్యాలయంలో సమర్పించాలని యజమాని ని హెచ్చరించారు. కాగా ఈ సర్వే నంబర్‌–6 ప్రభు త్వ స్థలమని రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో నాలుగు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్వయంగా దగ్గరుండి ఇక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించిన విషయం తెలిసిందే. ఆ స్థలాన్ని మున్సిపల్‌ సైతం స్వాధీనం చేసుకుంది. తనిఖీల్లో టీపీవో వినీత్‌, టీపీఎస్‌లు సాయి, కావ్య, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement