‘చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి’ | - | Sakshi
Sakshi News home page

‘చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి’

Jun 20 2026 10:50 AM | Updated on Jun 20 2026 10:50 AM

కామారెడ్డి అర్బన్‌: చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్‌ చేశారు. వచ్చే నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించే చాకలి ఎస్సీ సాధన సమితి 9వ వార్షికోత్సవ సభ, ఛలో హైదరాబాద్‌కు సంబంధించిన కరప్రతాలను ఆమె శుక్రవారం కామారెడ్డి ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాకలి కులాన్ని ఎస్సీలో చేర్చుతామని హామీ ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. చాకలి బంధు అమలు చేసి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, చాకలి ఐలమ్మ భవనానికి రూ.5 కోట్లు కేటాయించాలని, ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించాలని, హైదరాబాద్‌లో హాస్టళ్లు నిర్మించాలని, జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రాజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటప్పయ్య, యూత్‌ సహాయ కార్యదర్శి దేవరి నందు, నాయకులు భూమన్న, విజయ్‌కుమార్‌, రాజయ్య, సుధాకర్‌, రాజు, మహేష్‌, నర్సింలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement