పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి

Jun 20 2026 10:50 AM | Updated on Jun 20 2026 10:50 AM

ఎస్పీ రాజేశ్‌ చంద్ర

గాంధారి(ఎల్లారెడ్డి): పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, గంజాయి వినియోగం, విక్రయం, పేకాటపై గట్టి నిఘా పెట్టాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌ చంద్ర పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన గాంధారి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలను ఓపికతో వినాలని, వీలైనంత తొందరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌, సైబర్‌ నేరాలపై నిఘా ఉంచాలని సూచించారు. సదాశివనగర్‌ సీఐ సంతోష్‌ కుమార్‌, స్థానిక ఎస్సై మహేందర్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement