మహిళలను బస్సు ఓనర్లను చేసిన
● వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాకుండా బస్సు ఓనర్లుగా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. అనంతరం ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో విఠల్‌వాడి వరకు ప్రయాణించారు. శుక్రవారం జుక్కల్ మండలం సావర్‌గావ్‌లో కండెబల్లూర్– సావర్‌గావ్– విఠల్ వాడి గ్రామాలకు కొత్త బస్ సర్వీసును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళలను కోటిశ్వరులు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పథకాలు తీసుకొస్తున్నారని అన్నారు.
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ బడులు
ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా రూపు రేఖలు మారుతున్నాయని అన్నారు. శుక్రవారం జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్యఅఽధితిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులను పంపిణి చేశారు. విద్యార్థులతో క లిసి భోజనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎన్‌ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.
సోయాబీన్ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
మద్నూర్(జుక్కల్): ప్రభుత్వం అందించే సోయాబీన్ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్(ఎన్‌ఏంఈవో) పథకంలో భాగంగా ఎఫ్‌పీవో(మద్నూర్) ద్వారా రైతులకు సోయాబీన్ విత్తనాలను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. ఏవో రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, ఎఫ్‌పీవో చైర్మన్ గోపాల్, నాయకులు సంతోష్‌మేసీ్త్ర, హన్మాండ్లు స్వామి, రైతులు పాల్గొన్నారు.


