దోమకొండ: దోమకొండలో గడికోట అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం సాముహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జూన్ 19న గడికో ట వారసులు కీర్తిశేషులు కామినేని ఉమాపతిరావ్ జయంతిని పురస్కరించుకొని అక్షరాభ్యా సం చేపట్టారు. అనంతరం పదో తరగతి పరీక్ష ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ట్రస్ట్ మేనేజర్ బాబ్జి అందజేశా రు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించా లని ఆకాంక్షించారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఐసీడీఎస్ సీడీపీవో రోషిష్మ, మాజీ సర్పంచ్ శ్రీమతి నల్లపు అంజలి, చాముండేశ్వరీ ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధారెడ్డి, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గడికోట ట్రస్ట్ సభ్యులు గణేష్ యాదవ్, రాజశేఖర్ వినయ్, వెంకట లక్ష్మి, కల్పన పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఏప్రిల్/మే–2026లో నిర్వహించిన యూజీ బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ 2వ, 4వతోపాటు 6వ సెమిస్టర్ల (రెగ్యులర్), 1వ, 3వ, 5వ (బ్యాక్‌లాగ్) సెమిస్టర్ (2025–26) పరీక్షా ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాంమోహన్ రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి కే భరత్ రాజ్, కళాశాల అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు కే వినయ్ కుమార్, డాక్టర్ యస్ జయప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. https:// gdctg. cgg. gov. in/ nizamabad. edu లో ఫలితాలను చూసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆరో సెమిస్టర్‌లో 82.27 శాతం, నాలుగవ సెమిస్టర్ లో 50.17 శాతం, ఫస్ట్ ఇయర్ లో 47.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి: ఎంబీఏలో అడ్మిషన్ తీసుకోవాలనే, ఐసెట్ – 2026 పరీక్ష రాయని వారికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీఏ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.


