క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jun 20 2026 10:50 AM | Updated on Jun 20 2026 10:50 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఒకరి ఆత్మహత్య

వర్ని: చందూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జోషి బూమ్‌ జీ (56) మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. నాట్లు వేయటానికి వచ్చిన మహిళ చందూర్‌ వద్ద రోడ్డు దాటుతుండగా నిజామాబాద్‌ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బోధన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా జోషి బూమ్‌ జీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్‌ సయ్యద్‌ వాజిద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త ఎర్రం పవన్‌కుమార్‌ (42) అప్పుల భాదతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో హార్డ్‌వేర్‌ దుకాణం నడుపుతున్న పవన్‌కుమార్‌కు అప్పులు ఎక్కువయ్యాయి. మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 17న లక్కంపల్లి శివారులో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న మిత్రులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు.

నగరంలో మరొకరు...

నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలోని బ్రాహ్మణకాలనీకి చెందిన అనంతరావు(50) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు 5వ టౌన్‌ ఎస్సై సునీల్‌ తెలిపారు. కిడ్నీ, షుగర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అనంతరావు శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ప్రస్తుతం రెండో భార్య గోదావరితో కలిసి ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement